ఢిల్లీలో విద్యాసంస్థలకు మరోసారి బాంబు బెదిరింపులు (వీడియో)

ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, ద్వారకలోని సెయింట్ థామస్ పాఠశాలకు మంగళవారం ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను ఖాళీ చేయించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్, డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న కూడా 2 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.

సంబంధిత పోస్ట్