పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్‌

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని పలు ప్రముఖ పాఠశాలలకు బుధవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. మహారాజా అగ్రసేన్‌ స్కూల్‌, వేజల్పూర్ జైడస్‌ స్కూల్‌, నిర్మాణ్‌ స్కూల్‌, డివైన్‌ స్కూల్‌, ఆవిష్కర్ స్కూల్, కలోల్ దేవ్ ఇంటర్నేషనల్ వంటి పాఠశాలలకు ఈ మెయిల్స్‌ అందాయి. పాఠశాల ఆవరణలో పేలుడు పదార్థాలు ఉంచినట్లు మెయిల్‌లో పేర్కొన్నారు. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యాలు పోలీసులకు సమాచారం అందించడంతో, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.

సంబంధిత పోస్ట్