TG: హైదరాబాద్‌లోని కొన్ని ఏరియాల్లో సోమవారం స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సోమవారం కూడా బోనాల పండుగ జరుగనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతంలోని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చినట్లు సమాచారం. ఆదివారం ఉజ్జయిని మహంకాళి ఆలయానికి భక్తులు భారీగా చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు.