మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' మరో రికార్డు సాధించింది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఈ సినిమా అత్యధిక డిమాండ్ ఉన్న చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచినట్లు సమాచారం. అలాగే గంటకు సుమారు 40 వేల టికెట్లు అమ్ముడవుతున్నాయని వెల్లడైంది. విడుదలైన తొలి రోజే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుండటంతో ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.