TG: ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ బుధవారం టేకులపల్లి మండలంలో మాట్లాడుతూ, బూత్ స్థాయి ఏజెంట్లు పార్టీకి సైనికుల్లా పనిచేయాలని, బీఎల్‌వోలకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి బీఎల్‌ఏ చురుగ్గా పాల్గొని అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా కృషి చేయాలని, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల విషయంలో బీఎల్‌వోలతో సమన్వయం చేసుకుంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె కోరారు.