‘బాప్స్‌’ ఎఫెక్ట్‌.. పదవి వీడనున్న ఈఫిల్‌ టవర్‌ చీఫ్‌

పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ నిర్వహణ సంస్థ SETE డైరెక్టర్‌ జనరల్‌ పాట్రిక్‌ బ్రాంకో రుయివో పదవి నుంచి తొలగింపునకు గురయ్యారు. BAPS బృందం సందర్శన సమయంలో మహిళా సిబ్బందిని విధుల నుంచి పక్కకు తప్పించిన ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిగింది. ఆ చర్యలు ఆమోదయోగ్యం కాదని నివేదిక తేల్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు SETE తెలిపింది. ఈ ఘటనపై ఉద్యోగులు నిరసనకు దిగడంతో గతంలో ఈఫిల్‌ టవర్‌ను ఒకరోజు మూసివేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕