ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన బోర్ వెల్ బండి

TG: నర్సాపూర్ పట్టణంలో ఆదివారం ఆర్టీసీ బస్సును బోర్ వెల్ వాహనం ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి నుండి గజ్వేల్ వైపు వెళ్తున్న బస్సు నర్సాపూర్ బస్టాండ్‌లోకి ప్రవేశిస్తుండగా, హైదరాబాద్ నుండి వస్తున్న బోర్ వెల్ వాహనం బస్సు పక్క భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం నర్సాపూర్ ఏరియా దవాఖానకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్