పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ మధ్య ఇప్పటివరకూ మూడు యుద్ధాలు జరిగాయని, వాటి వల్ల సాధించిందేమీ లేదని ఆయన చెప్పారు. ఇరు దేశాలు శాంతి చర్చలు జరపాలని పేర్కొన్నారు. కశ్మీర్ అంశంతో సహా అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని, అప్పుడే శాంతి నెలకొంటుందన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లోనూ పరస్పరం సహకరించుకోవచ్చన్నారు.