అత్తపై బాలుడి అత్యాచారయత్నం

AP: నెల్లూరు జిల్లాలోని కోట మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలుడు వరుసకు అత్త అయిన ఓ వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. భర్తతో విడిపోయి కుమార్తెతో ఒంటరిగా నివసిస్తున్న మహిళ నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మహిళ కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్