ఫోన్ కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య

TG: ఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో ఓ బాలుడు ప్రాణం తీసుకున్నాడు. కరీంనగర్ జిల్లా రాజారాంపల్లి తండాకు చెందిన సాయి గణేష్ నాయక్ ఈ నెల 17న సెల్‌ఫోన్ కొనివ్వాలని తండ్రిని అడగగా మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రి నరేష్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕