హాస్టల్‌కి వెళ్ళడం ఇష్టం లేక సూసైడ్ చేసుకున్న బాలుడు

TG: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్‌కి వెళ్ళడం ఇష్టం లేక సాత్విక్(13) అనే బాలుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ 9వ తరగతి చదువుతున్న స్వాతిక్ 3 రోజుల క్రితం ఇంటికి రాగా, హాస్టల్‌కి వెళ్ళాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్