స్కూలు ఐడీ కార్డు ట్యాగ్‌తో ఉరేసుకుని బాలుడి ఆత్మహత్య!

TG: హైదరాబాద్‌లో దారుణం ఘటన చోటుచేసుకుంది. స్కూలు ఐడీ కార్డు ట్యాగ్‌తో ఉరివేసుకుని 9 ఏళ్ల బాలుడి ఆత్మహత్య చేసుకున్నాడు. చందానగర్ పరిధి రాజేంద్రనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాచ్‌మెన్ శంకర్ కుమారుడు ప్రశాంత్(9) తన స్కూలు ఐడీ కార్డు ట్యాగ్‌తో బాత్ రూంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఇది సూసైడా?.. ఎవరైనా చంపి ఆత్మహత్యగా క్రియేట్ చేశారా అనేది తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్