కారు ఢీకొని బాలుడి మృతి.. పోలీసుల అదుపులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

TG: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పుప్పాలగూడ అల్కాపురి కాలనీలో సోమవారం కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనంపై వెళ్తోన్న తండ్రీ కొడుకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్‌ కుమార్‌, అతని కుమారుడు కుశల జోయల్‌ తీవ్రంగా గాయపడ్డారు. బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే జోయల్‌ మృతి చెందాడు. కారు నడుపుతూ ప్రమాదానికి కారణమైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్