TG: జయశంకర్ భూపాలపల్లి(D) గణపురం(M) ధర్మారావుపేట గ్రామంలో జరిగింది. రాజేష్ అనే ఐదేళ్ల బాలుడు మూడు రోజుల నుండి కనిపించకుండా పోయాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం గుర్తించారు. గంపల శంకర్ అనే వ్యక్తి ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్తుండగా ఆ బాలుడికి యాక్సిడెంట్ అయింది. బాలుడు స్పాట్లోనే మృతి చెందాడు. దీంతో బాలుడి మృతదేహాన్ని శంకర్ బస్తాలో కట్టి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టిలో పాతిపెట్టాడని తెలిపారు.