అయ్యో పాపం.. తలలో త్రిశూలం దిగి బాలుడు మృతి

మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలో గురువారం ఘోర విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. సచిన్‌ మెంగ్వాడే, పల్లవి ఇద్దరూ భార్యాభర్తలు. వారి మధ్య గొడవను ఆపేందుకు వచ్చిన సచిన్‌ అన్న నితిన్‌ పైకి పల్లవి త్రిశూలం విసిరింది. ఆ త్రిశూలం నుంచి తప్పించుకునేందుకు నితిన్‌ పక్కకు జరగగా, వెనుకాలే నితిన్‌ భార్య చంకలో ఉన్న 11 నెలల బాలుడు అవదూత్‌ తలలోకి ఆ త్రిశూలం దూసుకెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్