HYD: బాచుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ప్రగతినగర్ లోని ఐకాన్ ప్రైమ్ రోజ్ అపార్ట్మెంట్ టెర్రస్ పైనుంచి పడి 17 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. జిమ్ చేసిన అనంతరం వాకింగ్‌కు వెళ్లిన సాయి విశాంత్ రెడ్డి అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే విశాంత్ మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని తల్లిదండ్రులు పేర్కొంటున్నప్పటికీ, అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.