AP: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో విషాదం చోటు చేసుకుంది. గోరాంచెరువు గ్రామంలోని బుచ్చేవాండ్లపల్లికి చెందిన ఆనంద శ్రీనివాస్ (5) అనే బాలుడు ఇంటిపై గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సంక్రాంతి సెలవుల సందర్భంగా బాలుడు అమ్మమ్మ ఇంటి వద్ద ఉండగా ఈ ఘటన జరిగింది. దాంతో బాలుడి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.