తల్లి కళ్లెదుటే కొడుకును వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టిన ఘటన మహారాష్ట్రలోని అకోలాలో జరిగింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. చిన్న గల్లీలో ఓ మహిళ ముందు వెళ్తుండగా ఆమె కొడుకు వెనకాలే పరుగెత్తుకుంటూ రోడ్డు దాటబోయాడు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన బైక్ ఆ పిల్లాడిని బలంగా ఢీకొట్టడంతో ఎగిరిపడ్డాడు. వెంటనే ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇరుకైన రోడ్డులో 80 km వేగంతో వెళ్లడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.