మహారాష్ట్ర లాతూర్ సిటీ ఆనంద్ నగర్ ఏరియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ చిన్నారిని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్‌పై ఉన్న వ్యక్తి పట్టించుకోకుండా అలాగే వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.