ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో స్నేహితులతో కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన 18 ఏళ్ల సోహెల్‌ను, అతని స్నేహితుడే నీటిలో ముంచి కిరాతకంగా హత్య చేశాడు. ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నా వదలకుండా, సుమారు 2 నిమిషాల పాటు నీటిలో ముంచి చంపినట్లు సమాచారం. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.