గొడ్డలితో దాడి చేసి.. తల్లిని చంపిన బాలుడు

హర్యానాలోని కురుక్షేత్రలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి నుంచి విడిపోయి వేరుగా నివసిస్తున్న 45 ఏళ్ల ముఖేష్‌ రాణిని ఆమె చిన్న కుమారుడు మంగళవారం రాత్రి గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. తీవ్రంగా గాయపడిన రాణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తల్లిని హత్య చేసిన తర్వాత పరారీలో ఉన్న 16 ఏళ్ల బాలుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంట్లో గొడవలు, మానసిక పరిస్థితి వంటి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్