చెన్నైలోని నీలాంగరైలో గురువారం జరిగిన తమిళగ వెట్రి కళగం (TVK) విద్యా పురస్కారాల కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై విజయ్ను చూసి ముగ్ధుడైన ఒక చిన్న బాలుడు, ఆయన చెంపపై ముద్దు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. బాలుడి ప్రేమకు విజయ్ చిరునవ్వుతో స్పందించి, ఆప్యాయంగా ఫొటోకు పోజులిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.