హరియాణాలోని పంచ్కులాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆరేళ్ల బాలికపై ఒక బాలుడు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కీలక వెలుగులోకి వస్తున్నాయి. సదరు బాలుడు పబ్జీ (PUBG) వంటి హింసాత్మక వీడియో గేమ్స్‌కు బానిసయ్యాడని బాధితురాలి అంకుల్ ఆరోపించారు. బాలుడి తండ్రి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాన్నారు. నిందితుడు బాలికను ఖాళీ తరగతి గదికి తీసుకెళ్లి దాడి చేశాడని తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాలిక సుమారు 40 గంటల తర్వాత స్పృహలోకి వచ్చినట్లు తెలిసింది.