ఇండోనేషియాలో 11 ఏళ్ల రేయాన్ అర్కాన్ దిఖా చేసిన బోట్ టాప్ నృత్యం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రేసింగ్ పడవ ముందు భాగంలో అతని రిథమిక్ స్టెప్స్, స్టైలిష్ మూవ్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే కోట్లలో వ్యూస్, లక్షల్లో లైక్స్ వచ్చాయి. రోయింగ్ పోటీల్లో తుకాంగ్ టారీ అనే నర్తకుడు జట్టుకు ప్రేరణనిచ్చే విధంగా నృత్యం చేస్తూ మిగతా సభ్యులకు ఉత్సాహం నింపుతుంటారు.