కదులుతున్న రైలు డోర్ వద్ద నిల్చుని ఉన్న ఓ బాలుడు, ఒక మహిళ మెడలోని గొలుసును లాక్కొని రైలు నుంచి దూకి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భద్రతా లోపంతో నేరాలు జరుగుతున్నాయని, ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.