రణవీర్ సింగ్‌తో బోయపాటి పాన్ ఇండియా మూవీ?

దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులపై దృష్టి సారించారు. అఖండ-2 చిత్రం ఆశించిన స్పందన రాకపోవడంతో ఇప్పుడు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. తన తదుపరి ప్రాజెక్టు కోసం ఇటీవల బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌ను కలిసి కథ చెప్పినట్లు సమాచారం. రణవీర్ సింగ్ మాస్ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నప్పటికీ, గతంలో ప్రశాంత్ వర్మతో చేయాల్సిన సినిమాను పక్కన పెట్టిన ఆయన, ఇప్పుడు బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్