TG: ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని ప్రియుడు సూసైడ్ చేసుకున్నాడు. కొనిజర్ల(M) కొండవనమాలకు చెందిన యువకుడు శ్రీను(24) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. చింతకాని మండలానికి చెందిన ఓ యువతితో శ్రీను ప్రేమలో ఉన్నాడు. ఇటీవల యువతి మాట్లాడకపోవడంతో మానసిక వేదనకు గురైన అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు.