ముంబైలోని పోవాయ్‌కి చెందిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న ప్రియురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులు ఆమెను కాపాడారు. శనివారం 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు ఇందుకు అతని ప్రియురాలే కారణమని భావించారు. ఆమె ఇంటికి వెళ్లి తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. ఇంటిలో ఉరివేసుకుంటున్న ఆమెను పోలీసులు కాపాడారు. హుటాహుటిన ఘాట్కోపర్‌లోని రాజవాడి ఆస్పత్రికి తరలించారు.