ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని గౌరీ శంకర్ ప్యాలెస్ హోమ్‌స్టేలో ప్రేమజంట మృతదేహాలు లభ్యమయ్యాయి. డియోరియాకు చెందిన ఆయుష్ కుమార్, బారాబంకిలోని దరియాబాద్‌కి చెందిన అరోమాగా పోలీసులు గుర్తించారు. ఆయుష్ తన ప్రియురాలిని కాల్చి, తర్వాత తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హోమ్‌స్టే సిబ్బంది సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరి గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.