బీహార్‌లోని పాట్నాలో గురువారం ఓ యువతి దారుణ హత్యకు గురైంది. వివరాల ప్రకారం.. SK పూరి PS పరిధిలో నివాసం ఉంటున్న తన ప్రియురాలైన సంజన ఇంటికి సూరజ్ కుమార్ మధ్యాహ్నం వేళలో వెళ్ళాడు. వారిద్దరి మధ్య ఏదో వివాదం తలెత్తడంతో ఆమెను కత్తితో మెడ, కడుపు, వీపుపై అనేకసార్లు పొడిచాడు. గాయపడిన ఆమెను గదిలోనే ఉంచి గ్యాస్‌కు నిప్పంటించి సజీవదహనం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.