గుజరాత్‌లోని కచ్ జిల్లాలో CRPF కానిస్టేబుల్ దిలీప్ డాంగ్చియా ASI అరుణాబెన్ నతుభాయ్ జాదవ్‌ను గొంతుకోసి హత్య చేశాడు. 2021లో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వీరిద్దరూ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. శుక్రవారం వారికి గొడవ జరిగింది. అనంతరం ఆమెను చంపేసి శనివారం ఆమె విధులు నిర్వర్తిస్తున్న అంజార్ పీఎస్‌కు వెళ్లి లొంగిపోయాడు. అరుణాబెన్ తన తల్లిని దూషించిందనే కోపంతోనే చంపేశాడని సమాచారం.