తెలుగు సినిమా చరిత్రలో కామెడీని కొత్త స్థాయికి తీసుకెళ్లిన నటుడు బ్రహ్మానందం. 1,000కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఆయన, వెండితెరపైనే కాకుండా ఒక ఎమోషన్‌గా మారారు. సినిమాల్లోకి రాకముందు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన, దర్శకుడు జంధ్యాల ద్వారా 'అహ నా పెళ్ళంట'లో అరగుండు పాత్రతో వెలుగులోకి వచ్చారు. ఒకే భాషలో అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన ఆయనను భారత ప్రభుత్వం 'పద్మశ్రీ'తో గౌరవించింది. 'రంగమార్తాండ'లో సీరియస్ రోల్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన ప్రభావం సోషల్ మీడియా మీమ్స్‌లోనూ కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకుల తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.