బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారిలో తలనొప్పి, ముఖ్యంగా ఉదయానికే ఎక్కువగా ఉండే తలనొప్పి వస్తుంది. కండరాలు బిగుసుకోవడం, అకస్మాత్తుగా కదలడం, దృష్టి మసకబారడం, వినికిడి సమస్యలు రావచ్చు. మతిమరుపు, గందరగోళం, నడవడంలో ఇబ్బంది, తలతిరగడం కనిపిస్తాయి. ఆకస్మిక కోపం, ఆందోళన వంటి వ్యక్తిత్వ మార్పులు కూడా ఉండవచ్చు. ఈ లక్షణాలు నిరంతరంగా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.