తిరుమలలో అక్టోబర్ 1, 5 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్‌ 1, 5 తేదీల్లో బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్రోటోకాల్‌ ప్రముఖులు మినహా సిఫార్సు లేఖలపై దర్శనాలను నిలిపివేయనుంది. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 4 తేదీల్లో సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕