'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్.జె.మిట్టే మృతి

ప్రముఖ అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ ఫేమ్‌ నటుడు ఆర్‌.జే. మిట్టే (34) మృతిచెందారు. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం బ్రౌన్స్‌విల్లేలో ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, దర్యాప్తు పూర్తయ్యాకే మృతికి గల కారణాలు వెల్లడికానున్నాయి. ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’లో వాల్టర్‌ వైట్‌ జూనియర్‌ పాత్రతో గుర్తింపు పొందిన మిట్టే పలు సినిమాలు, టీవీ సిరీస్‌లలోనూ నటించారు.

సంబంధిత పోస్ట్

✕
✕