BREAKING: హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట

తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్‌కు ఊరట లభించింది. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. కేటీఆర్‌ను పది రోజుల (DEC 30) వరకు అరెస్టు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసిన ధర్మాసనం.. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్