ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు గోండా-మాంకాపూర్ సెక్షన్‌లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాద ఘటనలో 4 ఏసీ బోగీలు బోల్తా పడ్డాయి. 12కి పైగా బోగీలు పక్కకి ఒరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.