హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) నాయకుడు ఓం ప్రకాష్ చౌతాలా (89) శుక్రవారం గురుగ్రామ్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. చౌతాలా డిసెంబరు 1989లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రికార్డు స్థాయిలో నాలుగు పర్యాయాలు హర్యానా సీఎంగా తన సేవలను అందించారు. అతని చివరి పదవీకాలం 1999 నుండి 2005 వరకు కొనసాగింది.