బంగారం, వెండి ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.650 తగ్గి రూ.1,40,250కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.710 తగ్గి రూ.1,53,000 పలుకుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గడంతో రూ.2,65,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.