చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలు పెంచాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.7.50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1653.50కు చేరింది. హైదరాబాద్‌లో రూ.1896గా ఉంది. అటు గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.