తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. జనవరి 29వ తేదీన ఇంటర్ ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్ష ఉండనుంది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.