భారత్ - పాకిస్థాన్ ఇరు దేశాలు కాల్పుల నిలుపుదలకు అంగీకరించిన కొద్ది గంటలకే పాక్ వక్ర బుద్ధిని ప్రదర్శించింది. జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్, బుడ్గామ్, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో పాక్ డ్రోన్లను గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇవాళ సాయంత్రమే మిలిటరీ యాక్షన్, ఫైరింగ్ నిలిపివేతకు పాక్, భారత్ అంగీకరించిన విషయం తెలిసిందే.