ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఆయన జ్వరంతో పాటు స్పాండిలైటిస్ తో బాధ పడుతున్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొన్నాయి. దీంతో రేపటి క్యాబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోవచ్చని తెలిపాయి.