కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో గురువారం అడ్మిట్ అయ్యారు. కడుపునొప్పి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సోనియా ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, శుక్రవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.