ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. సుక్మా జిల్లాలోని మారుమూల గ్రామంలో ఒకే నెలలో 13 మరణాలు చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఒంటినొప్పులతో గ్రామస్తులు మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించింది. మహువా సేకరణకు వెళ్లిన వారంతా డీహైడ్రేషన్‌కు గురయ్యారని వైద్యులు తెలిపారు. 80 మంది బ్లడ్ సాంపిల్స్ సేకరించి పరిశీలిస్తున్నారు.