తమిళ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) తన వ్యక్తిగత జీవితంపై మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన 14 ఏళ్ల వైవాహిక జీవితంలో భార్య తనను బానిసలా చూసిందని, సంపాదించిన ఆస్తులన్నీ ఆమె కుటుంబ సభ్యులే తీసుకున్నారని, ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అర్థం చేసుకున్న ప్రియురాలు కెనీషా ఫ్రాన్సిస్‌ను కూడా టార్గెట్ చేసి పంపించేశారని, పిల్లలను కూడా కలవనివ్వడం లేదని కన్నీటితో తెలిపారు. వ్యక్తిగత జీవితం సరిదిద్దుకున్నాకే సినిమాల్లోకి వస్తానని ఆయన స్పష్టం చేశారు.