రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతమైన క్యాచ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఆడిన షాట్‌ను అమాంతం గాల్లోకి ఎగిరి, ఒంటిచేత్తో ఒడుపుగా పట్టుకున్నాడు. ఈ క్యాచ్ చూసిన క్రికెట్ అభిమానులు, దీనిని ప్రపంచ క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ చేసిన క్యాచ్‌లతో పోలుస్తున్నారు. బ్రెవిస్ ఈ క్యాచ్‌తో రుతురాజ్ గైక్వాడ్ వికెట్ తీయడంలో కీలక పాత్ర పోషించాడు, దీంతో టీమిండియా 183 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.