స్వామినారాయణ్ హిందూ ఆలయంపై ఇటుకల దాడి (వీడియో)

అమెరికాలోని ఒహాయోలో స్వామినారాయణ్ హిందూ గుడిపై ఇటుకల దాడి జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 1:30 సమయంలో ఈ దాడి జరిగింది. పూజారులు, భక్తులు లోపలే ఉన్నప్పుడే దుండగులు ఇటుకలు విసిరారు. దాడిలో గుడి కిటికీలు ధ్వంసమై భారీ నష్టం వాటిల్లింది. సీసీటీవీ దృశ్యాలను అధికారులు పరిశీలిస్తుండగా, ఈ దాడిని హేట్ క్రైమ్‌గా పరిగణించాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ డిమాండ్ చేసింది.  అమెరికాలో హిందువులపై పెరుగుతున్న ద్వేషపూరిత దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕