పహల్గాం ఉగ్ర దాడిని బ్రిక్స్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో 'రియో డీ జెనీరో డిక్లరేషన్'ను సభ్యదేశాలు విడుదల చేశాయి.