న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా 18వ బ్రిక్స్(BRICS) శిఖరాగ్ర సమ్మిట్ శనివారం ప్రారంభం కానున్నాయి. ఇవాళ మ.2.35 గంటలకు సభ్య దేశాల నేతల మధ్య సమావేశం జరగనుంది. సా.4.25 గంటలకు భారత్ ఇన్నోవేట్స్ ఎగ్జిబిషన్ను సందర్శిస్తారు. 5.05 గంటలకు గ్రూప్ ఫొటో, మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది. రా.7.30 గంటలకు సభ్య దేశాల నేతలకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు.